ENGLISH

బికినీ బ్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2019

30 December 2019-13:08 PM

ఈ ఏడాది ఏ హాట్‌ బ్యూటీకి లేనంత క్రేజ్‌ 'లోఫర్‌' బ్యూటీ దిశా పటానీ దక్కించుకుంది. అందుకు కారణం పాప బికినీ షోలే. కాల్విన్‌ క్లెయిన్‌ ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిశా పటానీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అసలే బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో ఈ బ్యూటీ రూటే సెపరేటు. అలాంటిది ఓ ఇన్నర్‌ వేర్‌ని ఇంతలా ప్రమోట్‌ చేసిన ఘనత ఒక్క దిశా పటానీకే దక్కుతుంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాని తన ఇన్నర్‌ వేర్‌ అంద చందాలతో ఉర్రూతలూగించింది దిశా పటానీ. దీంతో పాటు సినిమాలు కూడా బాగానే చేసింది. అయితే, బాలీవుడ్‌ మూవీస్‌లోనే నటించింది.

 

సల్మాన్‌ ఖాన్‌తో 'భారత్‌' సినిమాలోనూ, హృతిక్‌ రోషన్‌తో ఓ సినిమాలోనూ నటించింది. అయితే, సౌత్‌ మీద మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. తెలుగులో 'లోఫర్‌' సినిమాలో నటించింది. డెబ్యూ మూవీ నెగిటివ్‌ రిజల్ట్‌ ఇవ్వడంతో, మళ్లీ సౌత్‌ సినిమాలపై దృష్టి పెట్టలేకపోయింది. అయితే, 2020లో తెలుగులో ఓ సినిమా చేస్తానని చెప్పింది. ఆ సినిమా ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, ఖచ్చితంగా ఈ ఏడాది తెలుగు సినిమాలో నటిస్తానని నమ్మకంగా చెబుతోంది. అంటే ఈ పాటికే ఈ స్పైసీ చిన్నది తెలుగులో ఏదైనా సినిమా ఓకే చేసేసిందా.? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ALSO READ: Disha Patani Hottest Photoshoot