ENGLISH

ఆచార్య‌తో పాటే వేదాళం కూడా!

03 October 2020-13:00 PM

చిరంజీవి ఫుల్ జోష్‌పై ఉన్నాడు. `ఆచార్య‌` సినిమా జ‌రుగుతుండ‌గానే మూడు క‌థ‌ల‌కు ఓకే చెప్పాడు. లూసీఫ‌ర్‌, వేదాళం రీమేక్‌లు చిరు చేతిలో ఉన్నాయి. బాబి చెప్పిన క‌థ‌కీ ఓకే చెప్పాడు. ఈ మూడూ ఒక‌దాని త‌ర‌వాత మ‌రోటి ప‌ట్టాలెక్కుతాయి. కాక‌పోతే.. ఆచార్య‌తో పాటు వేదాళం రీమేక్‌నీ స‌మాంత‌రంగా షూటింగ్ జ‌ర‌పాల‌ని చిరు భావిస్తున్న‌ట్టు టాక్‌.

 

ఈనెల‌లోనే ఆచార్య షూటింగ్ మొద‌ల‌వుతుంది. ద‌స‌రా త‌ర‌వాత‌.. వేదాళం రీమేక్‌నీ స‌మాంత‌రంగా ప‌ట్టాలెక్కించాల‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. వేదాళం కి సంబంధించిన స్క్రిప్టు వ‌ర్క్ పూర్త‌య్యింది. ఇక లొకేష‌న్లు చూస‌కోవ‌డం, మిగిలిన న‌టీన‌టుల్ని సెట్ చేయ‌డ‌మే త‌రువాయి. చిరు చెల్లాయిగా సాయి ప‌ల్ల‌వి పేరు దాదాపు ఖాయం అయిపోయింది. కొల‌కొత్తా నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నార్ట‌. ద‌స‌రా త‌రవాత‌.. కొల‌కొత్తాలో కొన్ని కీల‌క‌మైన సన్నివేశాలు తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. ముందుగా చిరు లేని సీన్లు పూర్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. `ఆచార్య‌` పూర్త‌య్యాక చిరు నేరుగా `వేదాళం` సెట్‌లో పాల్గొనేలా షెడ్యూల్ నిరూపొందిస్తున్నారు.

ALSO READ: ఆర్‌.ఆర్.ఆర్‌.. ట్రైల్ షూట్‌కి అంతా రెడీ!