ENGLISH

కొర‌టాల‌కు చిరు డెడ్‌లైన్‌

06 January 2020-09:05 AM

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని అత్యంత వేగంగా పూర్తి చేసే బాధ్య‌త కొర‌టాల శివ‌పై ప‌డింది. ఎందుకంటే చిరు కొర‌టాల‌కు డెడ్‌లైన్ విధించారు. 99 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అది కూడా అశేష అభిమానుల మ‌ధ్య‌.

 

వివ‌రాల్లోకి వెళ్తే... మ‌హేష్ బాబు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి అతిథిగా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా స‌రిలేరు సినిమా త్వ‌ర‌గా పూర్త‌యింద‌ని, మిగిలిన హీరోలు, ద‌ర్శ‌కులు కూడా వేగంగా సినిమాలు చేయ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని, అప్పుడే ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని చెప్పుకొచ్చారు.

 

''స‌రిలేరు 5 నెల‌ల్లో పూర్తి చేశార‌న్న విష‌యం తెలిసి మ‌రి మ‌న సినిమా మాటేంటి? అని కొర‌టాల‌ని అడిగాను. 100 రోజుల్లోగా పూర్తి చేస్తాన‌ని మాట ఇచ్చాడు. 99 రోజుల వ‌ర‌కూ ఓకే. వంద అంకె రాకూడ‌దు. వ‌స్తే బాగుంద‌దు. ఇంత మంది జ‌నం ముందు మాటిచ్చేస్తున్నా'' అంటూ కొర‌టాల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు చిరు. సో.. చిరు సినిమా కూడా త్వ‌ర‌గా పూర్త‌వ్వ‌డం ఖాయం అన్నమాట‌.

ALSO READ: షాక్‌: లైవ్‌లో బూతులు తిట్టిన శివాజీ