ENGLISH

త్వ‌ర‌లో దాస‌రి బ‌యోపిక్‌

09 October 2020-11:00 AM

తెలుగుచిత్ర‌సీమ‌లో దాస‌రి ది ప్ర‌త్యేక‌ స్థానం. `గురువు` స్థానాన్ని అలంక‌రించిన విశిష్ట‌ వ్య‌క్తిత్వం. 150 చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, ఎవ‌రికీ అంద‌ని అపూర్వ రికార్డు సృష్టించారు. ఎంతోమంది శిష్యుల్ని త‌యారు చేసుకున్నారు. ఆయ‌న ప్ర‌యాణం.. ఈత‌రానికి ఓ పాఠం. ఇప్పుడు ఆయ‌న క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

 

దాస‌రి క‌థ‌ని వెండి తెర‌పై ఆవిష్క‌రిస్తానంటున్నారు దర్శ‌కుడు మారుతి. అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ని, దాస‌రి ఆశీర్వాదం ఎప్పుడు పొందితే , అప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని అంటున్నారు మారుతి. అయితే... ఇది పూర్తి ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తెర‌కెక్క‌బోతోంద‌ని స‌మాచారం. ప‌రిమిత బ‌డ్జెట్ తో ఈ సినిమాని పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. దాస‌రిగా ఎవ‌రు న‌టిస్తారు? ఆయ‌న క‌థ ఎక్క‌డి నుంచి ఎక్క‌డి వ‌ర‌కూ చూపిస్తారు? అనేది ఆస‌క్తిగా మారుతోంది. మొత్తానికి టాలీవుడ్ లో మ‌రో బ‌యోపిక్ కి రంగం సిద్ధ‌మైంది. ఇక ముహూర్తం కుద‌ర‌డ‌మే త‌రువాయి.

ALSO READ: చిరుని టెన్ష‌న్ పెడుతున్న కాజ‌ల్