ENGLISH

గ్లామ్‌షాట్‌: బ్రాండ్‌ బ్యూటీ బ్లాక్‌ హాట్‌ దర్శనం!

24 January 2020-15:46 PM

హాట్‌ హాట్‌ బ్రాండ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దిశా పటానీ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పిక్‌ వదిలింది. ఎప్పుడూ బికినీ పోజుల్లో సోషల్‌ మీడియాని హీటెక్కించేసే ఈ భామ తాజాగా బ్లాక్‌ హాట్‌ మోడ్రన్‌ డ్రస్‌లో సరికొత్తగా దర్శనమిచ్చింది. నిజానికి ఇది కూడా ఓ రకమైన బికినీనే. ఇన్నర్‌ వేర్‌ కాస్ట్యూమే. అయితే, పైన ఆ బ్లాక్‌ ప్యాటర్న్‌తో కవర్‌ చేసి, ఓ డ్రస్‌ బిల్డప్‌ ఇచ్చిందంతే. ఎక్కడిక్కడ డ్రస్‌ అంతా కట్స్‌ ఉన్నాయి. ఆ కట్స్‌ నుండి తన కాళ్ల సౌందర్యాన్ని దాదాపు తన బికినీ స్పేస్‌ వరకూ చూపిస్తూ, వయ్యారాలు పోతోంది. ఇక టాప్‌ లెవల్‌కొచ్చేసరికి స్లీవ్‌లెస్‌ స్ట్రిప్‌లెస్‌ డీప్‌ నెక్‌ హొయలు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

టాప్‌ టూ బోటమ్‌ బ్లాక్‌లోనే మెరిసిపోతోంది. కానీ, స్కిన్‌ మాత్రం చాక్లెట్‌ కలర్‌లో తళుక్కుమంటోంది. లూజ్‌ గ్రే ఫాలింగ్‌ హెయిర్‌ దిశా అందమైన మోముని సగం వరకూ కప్పేసి మరింత అందాన్ని తెచ్చి పెడుతోంది. ఓన్లీ స్కిన్‌ షోనే కానీ, మెడలో యాక్సెసరీస్‌లాంటివేమీ ధరించలేదు.ఒక చేతికి సింపుల్‌గా మెటల్‌ బ్యాంగిల్స్‌, చెవులకు ఫ్లవర్స్‌లాంటి కమ్మలు ధరించింది. పొడవాటి ఈ లేడీ ఫింగర్స్‌కి అందమైన కొన్ని ఉంగరాలు కూడా ఉన్నాయండోయ్‌.

ALSO READ: Disha Patani Hot Photoshoot