ENGLISH

దిశా పటానీ అందాల బీభత్సం!

06 January 2020-15:00 PM

ఇందులో వింతేముంది.? దిశా పటానీకి అదే పని కదా అనుకుంటున్నారా.? అయితే, జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌.. ఎప్పుడూ బికినీలతో సోషల్‌ మీడియాని హీటెక్కించే దిశా పటానీ ఈ సారి బిగ్‌ స్క్రీన్‌పై తన బికినీ దాడి చేసింది. బాలీవుడ్‌లో దిశా పటానీ ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిశా నటిస్తున్న 'మలంగ్‌' చిత్రం ట్రైలర్‌ లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో హీరో యాక్షన్‌ సీక్వెన్సెస్‌తో దిశా హాట్‌ అండ్‌ స్పైసీ అంద చందాల ప్రదర్శన తెగ పోటీ పడిపోయింది. బికినీలతో బిగ్‌ స్క్రీన్‌ని ఓ రేంజ్‌లో హీటెక్కించేసింది. హీరోతో హాట్‌ హాట్‌ కిస్సింగ్‌ సీన్స్‌తో పాటు, తన బ్రాండ్‌ అయిన బికినీల్ని ఇక్కడ కూడా వదిలి పెట్టలేదు. నాలుగైదు హాట్‌ హాట్‌ బికినీ సీన్స్‌లో విజృంభించి స్కిన్‌ షో చేసింది దిశా పటానీ. అలాగే హీరోతో దిశా పటానీ అదిరిపోయే హాట్‌ కెమిస్ట్రీ పండించింది.

ఇంతవరకూ రిలీజైన పోస్టర్స్‌లోనే కెమిస్ట్రీ సూపర్బ్‌ అనుకుంటే, ఇక ట్రైలర్‌లో స్టార్టింగ్‌ నుండీ, ఎండింగ్‌ వరకూ నువ్వా నేనా? అనేలా దిశా బికినీ షాట్స్‌ కట్‌ చేశారు. మోహిత్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ హీరో కాగా, సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 7న 'మలంగ్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: ఫ్యాన్స్‌కి బన్నీ ట్రీట్ - అదే ఈ రోజు స్పెష‌ల్‌.