ENGLISH

బిగ్‌ గెస్సింగ్‌: బిగ్‌బాస్‌ విజేత ‘ఎ’వరంటే.!

12 October 2020-16:22 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 మొదలయినప్పటినుంచీ ఇప్పటిదాకా పలు సందర్భాల్లో బిగ్‌ హోస్ట్‌ ‘కింగ్‌’ అక్కినేని నాగార్జున ‘ఎ’ అనే లెటర్‌ గురించి ఎక్కువగా మాట్లాడుతున్న విషయం విదితమే. ‘ఎ’ అంటే అబిజీత్‌, ‘ఎ’ అంటే అఖిల్‌ సార్థక్‌. ఈ ‘ఎ’ అనే ప్రస్తావన పదే పదే ఎందుకు వస్తోంది.? అంటే, మోనాల్‌ గజ్జర్‌ - ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ప్రస్తావన కోసం. అయితే, బిగ్‌హౌస్‌లో ‘ఎ’ అనే లెటర్‌తో ప్రారంభమైన కంటెస్టెంట్స్‌ ఇంకొందరు వున్నారు. అరియానా గ్లోరీ, అవినాష్‌ మాత్రమే కాదు, అమ్మ రాజశేఖర్‌ పేర్లు కూడా ‘ఎ’తోనే మొదలవుతాయి. వీరిలో అబిజీత్‌ టాప్‌ ప్లేస్‌లో వున్నాడు ప్రస్తుతానికి. ఆ తర్వాతి స్థానం అఖిల్‌ సార్థక్‌దే.

 

అనూహ్యంగా దూసుకొచ్చాడు అవినాష్‌. అరియానా గ్లోరీ కూడా టాలెంట్‌ వున్న కంటెస్టెంట్‌. అమ్మ రాజశేఖర్‌ని తక్కువ అంచనా వేసినోళ్ళంతా ఇప్పుడు ఆయన కూడా టాప్‌ 5లో వుంటాడనే అభిప్రాయానికి వస్తున్నారు. మిగతా కంటెస్టెంట్స్‌లో మెహబూబ్‌ చాలా స్ట్రాంగ్‌. లాస్య చివరి వారం వరకు వుంటుందా.? లేదా.? అన్నదానిపై కొన్ని సందేహాలున్నాయి. ఎలా చూసుకున్నా ఈసారి బిగ్‌బాస్‌ విజేత పేరులో మొదటి అక్షరం ‘ఎ’ అవబోతోందనీ, ఆ లిస్ట్‌లో అబిజీత్‌కే ఎక్కువ అవకాశాలున్నాయనీ, ఫిమేల్‌ కంటెస్టెంట్‌ అనే కోణంలో అదనపు ప్రయోజనాలు కల్పిస్తే అరియానా గ్లోరీ విన్‌ అయ్యే అవకాశం వుందనీ అంటున్నారు.

 

అందరికీ పెద్ద షాకిచ్చేలా అవినాష్‌ విన్నర్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడే విన్నర్‌ గురించి మాట్లాడటం ‘టూ ఎర్లీ’ అవుతుంది. కానీ, అంచనాలు అలా వున్నాయ్‌ మరి.

ALSO READ: నాగ్ కోసం పూరి క‌థ రెడీ అయిపోయిందా?