ఈ పాటికి పుష్ప 2 సందడి ఉండి ఉండేది. పుష్ప రాజ్ మొదట ఆగస్టు 15 న వస్తున్నట్టు ప్రకటించి, మళ్ళీ డిసెంబర్ కి వాయిదా వేసుకుని హ్యాండిచ్చాడు. దీనితో మిగతా సినిమాలు ఆగస్టు కి ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో మొదట చెప్పుకోవాల్సింది. రామ్, పూరి కాంబో మూవీ డబుల్ ఇస్మార్ట్. పుష్ప వాయిదా వలనే ఆగస్టు 15 కి వచ్చేలా డబుల్ ఇస్మార్ట్ సిద్దం అయ్యింది. ఇంతలో వీరికి పోటీగా మిస్టర్ బచ్చన్ కూడా రెడీ అయ్యాడు. దీనితో టాలీవుడ్ లో బచ్చన్ వర్సెస్ ఇస్మార్ట్ అన్న క్లాష్ వచ్చింది.
అగ్నికి ఆజ్యం పోసి నట్లు డబుల్ ఇస్మార్ట్ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి తన సొషల్మీడియా అకౌంట్స్ లో హరీశ్ శంకర్, రవితేజలను అన్ ఫాలో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావటం ఎందుకు ఎవరో ఒకరు తగ్గొచ్చుకదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి రవితేజ, హరీష్ లకి మిస్టర్ బచ్చన్ హిట్ కీలకం. అలాగే రామ్ , పూరి లకి కూడా డబుల్ ఇస్మార్ట్ హిట్ తప్పని సరి. వీళ్ళ కెరియర్ కి కీలకంగా మారిన సినిమాల రిలీజ్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ దీని పై స్పందిస్తూ 'పూరీతో తనకి స్పెషల్ బాండింగ్ ఉందని, పూరీతో కంపేర్ చేసుకునే స్థాయి తనది కాదని, పూరి ఒక లెజండరీ డైరెక్టర్ అని మిస్టర్ బచ్చన్ కున్న కొన్ని ఫైనాన్సియల్ కారణాల వలన, ఓటీటీ ఇష్యూస్ ని అడ్రెస్ చేయడం వల్ల అనుకోకుండా ఇలా జరిగిందని' క్లారిటీ ఇచ్చాడు. తనకన్నా పూరి మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థం చేసుకుంటాడని కూడా కొసమెరుపు ఇచ్చాడు హరీష్.