ENGLISH

'సరిలేరు..' బొమ్మ దద్దరిల్లిపోవడమే మిగిలుంది.!

06 January 2020-11:15 AM

అనుకున్నదానికన్నా అద్భుతంగా ఉంది 'సరిలేరు..' ట్రైలర్‌. ఫ్యాన్స్‌ ఊహించినదానికన్నా ఎక్స్‌ట్రీమ్‌ లెవల్‌లో ట్రైలర్‌ని కట్‌ చేశారు. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని సినిమాలో మిక్స్‌ చేశారు. ఇటు క్లాస్‌. అటు మాస్‌, యాక్షన్‌.. అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన హైలైట్స్‌ ఒక్కొక్కటిగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి బలం చేకూరేలా ట్రైలర్‌లో అన్నీ శాంపిల్‌ టచ్‌ ఇచ్చారు. హీరోయిన్‌ రష్మిక మండన్నా క్యూట్‌ అండ్‌ స్వీట్‌ అప్పియరెన్స్‌తో ట్రైలర్‌ స్టార్ట్‌ చేసి, మొదటి పార్ట్‌ అంతా నవ్వులతో నింపేశారు.

ఫ్యామిలీ ఆడియన్స్‌ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేట్లుంది. ఇక సెకండాఫ్‌, విజయ శాంతి - మహేష్‌ బాబు, విజయ శాంతి - ప్రకాష్‌ రాజ్‌ మధ్య వచ్చే కాంబినేషన్‌ సీన్స్‌ చాలా చాలా బలంగా తీర్చిదిద్దారు. ట్రైలర్‌ చివర్లో 'చిన్న బ్రేక్‌ తీసుకున్నా, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది..' అంటూ మహేష్‌ బాబు చెప్పే డైలాగ్స్‌ మాస్‌ ఆడియన్స్‌ని కట్టి పడేస్తున్నాయి. టోటల్‌గా 'సంక్రాంతికి అల్లుడొస్తాడనుకుంటే, మొగుడొచ్చాడు..' అని గతంలో రిలీజైన టీజర్‌లో ప్రకాష్‌ రాజ్‌ చెప్పిన డైలాగ్‌ వెరసి, ఈ సంక్రాంతి సీజన్‌లో మహేష్‌కి 'సరిలేరెవ్వరూ..' అనడం అతిశయోక్తి కాదేమో.

ALSO READ: నీకు మ‌న‌సెలా వ‌చ్చింది విజ‌య‌శాంతీ..?