ENGLISH

కాజ‌ల్ పెళ్లి డేట్ ఫిక్స్‌.

06 October 2020-11:32 AM

కాజ‌ల్ పెళ్లి వార్త సోష‌ల్ మీడియాలో య‌మ చ‌క్క‌ర్లు కొడుతోంది. దాంతో కాజ‌ల్ పెళ్లి నిజ‌మేనా? లేదంటే గాసిప్పా? అని సందేహించారు అభిమానులు. ఎట్ట‌కేల‌కు దీనిపై కాజ‌ల్ స్పందించింది. త‌న పెళ్లి వార్త నిజ‌మే అని ఒప్పుకుంది. అంతే కాదు.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. అక్టోబ‌రు 30న త‌న పెళ్లి జ‌ర‌గ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ముంబైలో అతి త‌క్కువ మంది సన్నిహితుల మ‌ధ్య గౌత‌మ్ ని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు చెప్పేసింది.

kajal marriage

క‌రోనా కాలంలో.. త‌న వివాహాన్ని చాలా సింపుల్ గా చేసుకుంటున్నా - కొత్త జీవితం ప్రారంభం అవుతున్నందుకు థ్రిల్లింగ్ గా అనిపిస్తోంద‌ని, పెళ్ల‌య్యాక కూడా ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం మాన‌న‌ని అభిమానుల‌కు మాటిచ్చింది. ప్ర‌స్తుతం ఆచార్య‌లో న‌టిస్తోంది కాజ‌ల్. దాంతో పాటు విష్ణుతో మోస‌గాళ్లులో క‌నిపించ‌నుంది. ఇది కాక మ‌రో రెండు సినిమాలు కాజ‌ల్ చేతిలో ఉన్నాయి.

ALSO READ: ఎన్టీఆర్ టీజ‌ర్ వ‌చ్చేస్తోందోచ్‌.. ముహూర్తం ఫిక్స్‌