ENGLISH

కళ్యాణ్‌రామ్‌కి కాస్త కష్టమే సుమీ!

14 January 2020-13:30 PM

గతంలో సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో పోటీ పడింది 'శతమానం భవతి'. అయితే, అప్పట్లో రెండు పెద్ద సినిమాలు హిట్టయినా.. వాటితోపాటే 'శతమానం భవతి' వసూళ్ళను సాధించింది. ఆ 'శతమానం భవతి' దర్శకుడే, ఇప్పుడు సంక్రాంతికి తన కొత్త సినిమా 'ఎంత మంచివాడవురా' తీసుకొస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన సినిమా ఇది. అయితే, ఇప్పుడు సీన్‌ ఇంకోలా వుంది. 'సరిలేరు నీకెవ్వరూ' బాక్సాఫీస్‌ వసూళ్ళను కుమ్మేస్తోంది. 'అల వైకుంఠపురములో' దుమ్ము రేపేస్తోంది. ఆ రెండు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి. 'ఎంత మంచివాడవురా' సినిమాపై ప్రీ బజ్‌ చాలా డల్‌గా కన్పిస్తుండడంతో, కళ్యాణ్‌రామ్‌కి కాస్త కష్టమేనని అంటున్నారు.

 

అయితే, సినిమా పట్ల టీమ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా వుంది. రెండు పెద్ద సినిమాలతోపాటు తమ సినిమానీ ప్రేక్షకులు ఆదరిస్తారనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. 'ఎంత మంచివాడవురా' ఓ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనీ, సినిమా తప్పక విజయం సాధిస్తుందనీ కళ్యాణ్‌రామ్‌ చెబుతున్నాడు. మెహ్రీన్‌ సంగతి సరే సరి. ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. గత సంక్రాంతికి 'ఎఫ్‌2' సినిమాతో హిట్టుకొట్టిన తాను, ఈ యేడాది 'ఎంత మంచివాడవురా'తో మంచి విజయాన్ని అందుకుంటోంది. మొత్తమ్మీద, ఈసారి సంక్రాంతి కళ్యాణ్‌రామ్‌కి పెద్ద పరీక్షే పెట్టనుంది. చూద్దాం, ఈ పరీక్షలో మంచి మార్కులు కళ్యాణ్‌రామ్‌కీ, మెహ్రీన్‌కీ, చిత్ర దర్శక నిర్మాతలకీ వసూళ్ళ రూపంలో పడతాయో లేదో.

ALSO READ: 'ఓబేబీ' నిర్మాత‌ల మ‌రో కొరియ‌న్ రీమేక్‌!