టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగాయి. యువ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను వివాహమాడాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో కార్తికేయ - లోహితల పెళ్లి వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్ళు వేశాడు కార్తికేయ.
ఈ వేడుకకు పలువురు సినిమా తారలు విచ్చేసి నవవదువరులను ఆశీర్వదించారు.ఇటీవల రాజా విక్రమార్క సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన లోహితకు ప్రపోజ్ చేశాడు కార్తికేయ. కార్తికేయ-లోహిత 2010లో మొదటిసారిగా కలుసుకున్నారు. వరంగల్ నిట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ కోర్సు చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో - సంప్రదాయ బద్ధంగా ఒక్కటయ్యారు.
ALSO READ: ఓటీటీని నమ్ముకున్న శర్వానంద్?