ENGLISH

మ‌రీ ఇంత‌ బ్యాడ్ ల‌క్కా.. స‌ఖీ...?!

28 December 2021-14:08 PM

ఏ ముహూర్తాన గుడ్ ల‌క్ స‌ఖీ అని పేరు పెట్టారో గానీ, ఆ టైటిల్ కి రివ‌ర్స్ లో జ‌రుగుతోంది వ్య‌వ‌హారం అంతా. కీర్తి సురేష్ క‌థానాయిక గా న‌టించిన చిత్ర‌మిది. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌లు. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌యింది. ఎప్పుడో విడుదల కావాల్సింది కూడా. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈనెల 31న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అలికిడీ లేదు. మ‌రోసారి ఈ సినిమా వాయిదా ప‌డిన‌ట్టు టాక్‌.

 

ఇప్ప‌టికే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. ఇలా వ‌రుస వాయిదాల‌తో మ‌రింత శూన్యం అయిపోయింది. కీర్తి లేడీ ఓరియెంట్ సినిమాల‌న్నీ ఈమ‌ధ్య అట‌కెక్కుతున్నాయి. దాంతో ఈ సినిమా కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఓటీటీలో అమ్ముదామంటే అక్క‌డ కూడా ఈ సినిమాకి బ‌జ్ లేదు. ఏ ఓటీటీ సంస్థా ఈ సినిమా కొన‌డానికి ధైర్యం చేయ‌డం లేదు. అందుకే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి, బ‌జ్ లేక‌పోవ‌డంతో వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. డిసెంబ‌రు 31 దాటితే... ఇక ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల చేసుకోవాలి. ఈలోగా ఉన్న క్రేజ్ కాస్త హుష్ కాకి అయిపోతుంద‌న్న‌ది నిర్మాత‌ల భ‌యం.

ALSO READ: బాల‌య్య - సుక్కు.. మూడు నెల‌ల్లో సినిమా పూర్తి!