ENGLISH

గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో

21 January 2025-13:48 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కిరణ్ చాలా హార్డ్ వర్క్ తో  ఒక్కో మెట్టు ఎక్కాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నాళ్ళకి కెరియర్ లోనూ లైఫ్ లోనూ సెటిల్ అయ్యాడు. గత ఏడాది ఆగస్టులో రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్నాడు. వీరిది లవ్ మ్యారేజ్. వీరిద్దరూ కలిసి 'రాజా వారు రాణీ వారు' సినిమాలో కలిసి నటించారు. అదే టైంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

అయితే ఇప్పుడు తాను తండ్రి కాబోతున్నట్లు శుభవార్త చెప్పాడు. ఈ సందర్భంగా భార్య రహస్యతో దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  'మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది' అని ఈ శుభవార్తని షేర్ చేసుకున్నాడు. లైఫ్ లో పెళ్లి, వెంటనే పిల్లలతో వరుస ప్రమోషన్స్ అందుకున్న కిరణ్ అబ్బవరం కెరియర్ లోను సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్నాడు. గత ఏడాది దీపావళికి 'క' మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 న 'దిల్ రుబా' సినిమాతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఐదేళ్ల ప్రేమ ప్రయాణం తరువాత పెళ్లితో ఒక్కటై ఇప్పుడు ముగ్గురు కానున్నారని నెటిజన్స్ వీళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

ALSO READ: చైతూ కోసం రంగంలోకి బాలీవుడ్ విలన్