అక్కినేని నాగచైతన్యకి మంచి రోజులొచ్చాయి. లైఫ్ లో ఉన్న డిస్టబెన్స్ నుంచి బయటపడి కొత్త జీవితం మొదలు పెట్టాడు. కెరియర్ లోను సక్సెస్ అవుతున్నాడు. దూత వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో చైతూకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చైతు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టాడు. ఇప్పటికే విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విరూపాక్ష మూవీతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న కార్తీక్ మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్నాడు. ఈ సారి హారర్ థ్రిల్లర్ తో సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీకి 'వృష కర్మ' అన్న టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా టేక్నీషయన్స్, నటీ నటుల ఎంపిక జరగాల్సి ఉంది. చైతు కి జోడీగా మీనాక్షి, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరైనా కానీ చైతూ కి పర్ఫెక్ట్ గా ఉంటారు. ఫ్రెష్ జోడి. ఈ కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చైతుకి పర్ఫెక్ట్ విలన్ ని ఫిక్స్ చేసారంట.
ఈ మూవీ కోసం నార్త్ విలన్ ని రంగంలోకి దింపారు కార్తీక్. 'బాలికా వధు' సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న 'స్పర్ష్ శ్రీవాత్సవ' చైతూ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా 'లా పతా లేడీస్' మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు స్పర్ష. చైతుతో ఢీ కొట్టేందుకు సమానమైన జోడీ అని మేకర్స్ భావన. త్వరలోనే లుక్ టెస్ట్ చేసి, అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ మూవీలో విలన్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని, రెగ్యులర్ కమర్షియల్ విలనిజానికి భిన్నంగా ఇందులో విలన్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.
ALSO READ: టాలీవుడ్ కు ఐటీ గుబులు... బడా నిర్మాతలకు గుండె దడ