ENGLISH

అమెరికాలో కుర్రోడు జోరు చూపిస్తున్నాడు

18 March 2018-09:00 AM

యంగ్‌ హీరో నిఖిల్‌ తాజాగా 'కిర్రాక్‌ పార్టీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాల కొరత ఉన్న ఈ టైంలో నిఖిల్‌ 'కిర్రాక్‌ పార్టీ' కాస్త రిలీఫ్‌ అనే చెప్పొచ్చు. అయితే అమెరికాలో మాత్రం మనోడు మాంచి జోరుమీదున్నాడు. 

అక్కడ ప్రివ్యూ షోస్‌కే మంచి వసూళ్లు రాబట్టేశాడు నిఖిల్‌. అలాగే ఓపెనింగ్స్‌ కూడా బాగా వచ్చాయని ట్రేడ్‌ పండితుల సమాచారమ్‌. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్‌ సీజన్‌ నడుస్తుండడంతో నిఖిల్‌ సినిమాకి ఓపెనింగ్స్‌ అంతంత మాత్రంగానే వచ్చాయని అంటున్నారు. అయితే తర్వాతర్వాత ఈ సినిమా పుంజుకునే అవకాశాలున్నాయి. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'కిర్రాక్‌ పార్టీ' యూత్‌నే ఎక్కువ ఎట్రాక్ట్‌ చేస్తోంది. అందులోనూ ఇంటర్‌ ఎగ్జామ్స్‌ అయిపోయిన సందర్భంగా ఇంటర్‌ విద్యార్ధులకు, ఈ సినిమా కొంత రిలాక్స్‌డేషన్‌గా అనిపించింది.

 

దాంతో ఓపెనింగ్స్‌ పరంగా ఇక్కడ కూడా ఓకే అనిపించింది. ప్రస్తుతానికి మిశ్రమ టాక్‌తో రన్‌ అవుతున్నా, ముందు ముందు వసూళ్ల పరంగా ఈ సినిమా మరింత ముందుకెళ్లే అవకాశాలు లేకపోలేవంటున్నారు. కంటెన్ట్‌ పరంగా ఆ అంచనాలు వేస్తున్నారు. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించిన 'కిరిక్‌ పార్టీ'కి రీమేక్‌గా తెరకెక్కింది. రెండు విభిన్న పాత్రల్లో నిఖిల్‌ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. సిమ్రన్‌, సంయుక్త హెగ్దే కథానాయికలుగా నటించారు.

ALSO READ: 'కిరాక్ పార్టీ' షాకింగ్ కలెక్షన్స్