ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ కస్తూరి కృతిశెట్టి పెద్దగా స్టార్ డమ్ తెచ్చుకోలేక పోయింది. తెలుగులో అందరి స్టార్ హీరోలతో నటించినా సక్సెస్ కాలేకపోయింది. దీనితో ఇప్పుడు తెలుగులో ఛాన్స్ లు తగ్గాయి కృతికి. తెలుగులో అవకాశాలు తగ్గటంతో మిగతా భాషల్లో ద్రుష్టి పెట్టి కెరియర్ ల్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మధ్యనే తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. మలయాళం లో టోవినో థామస్ తో కలిసి ఒక సినిమా చేయగా అది సూపర్ హిట్ అయ్యింది.
బాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే ఛాన్స్ లు వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలుగులో వచ్చిన 'బేబీ' మూవీ హిందీ రీమేక్ లో కృతి శెట్టి ఫిక్స్ అయినట్టు సమాచారం. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవర కొండ, అశ్విని విరాజ్ నటించిన బేబీ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ మూవీ హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. మొదట రీమేక్ లో ఇషాన్ కట్టర్, ఖుషి కపూర్, బాబీ డియోల్ కొడుకు ఆర్యమన్ డియోల్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద లాంటి స్టార్ కిడ్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు బేబీ రీమేక్ లో ఇర్ఫాన్ ఖాన్ వారసుడు 'బబిల్ ఖాన్' కన్ఫామ్ అయ్యాడని తెలుస్తోంది.
బబిల్ ఖాన్ కి జోడీగా కృతి శెట్టి అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకోసం కృతితో సంప్రదింపులు జరుపుతున్నారంట. కృతి కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. బాలీవుడ్ ఎంట్రీకి సరైన ఛాన్స్ రావటంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఎస్ కె ఎన్ ఈ మూవీని హిందీలో నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ తో సౌత్ నుంచి ఒక హీరోయిన్, ఒక దర్శకుడు తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు.