ENGLISH

జానీ మాస్టర్ కి సుప్రీం కోర్టులో ఊరట

23 November 2024-13:02 PM

పాన్ ఇండియా వైడ్ సత్తా చాటిన స్టార్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఈ మధ్య లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడీషియల్ కష్టడీలో కొన్నాళ్ళు ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24 న బెయిలు పై రిలీజైన జానీ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఎవర్నీ కలవటానికి గాని, మాట్లాడటానికి కానీ ఇష్టపడలేదు. ఈ మధ్యనే ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి అసలు నిజా నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని తెలిపారు. ఇన్నాళ్లు తనను సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట కాలంలో తనకి అండగా నిలిచిన భార్యని ప్రశంసించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జానీకి ఈ కేసులో బిగ్ రిలీఫ్ దొరికింది.

తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కిచ్చిన బెయిల్ రద్దు చేయాలని బాధితురాలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ని కొట్టివేసింది. జస్టిస్‌ సతీష్‌ చంద్ర మిశ్ర, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను డిస్మిస్‌ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనితో జానీ మాస్టర్ బెయిల్ పై ఉండటానికి ఎలాంటి ఆటంకం లేదు. మొత్తానికి జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది.