ENGLISH

హాట్‌ అండ్‌ స్పైసీ 'లావణ్యం'

22 June 2018-12:56 PM

'అందాల రాక్షసి' సినిమాతో క్యూట్‌గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే, తొలి సినిమా పక్కన పెడితే, 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత స్టార్‌ హీరో నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతోనూ మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత అమ్మడు పలు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయింది. ప్రస్తుతం మెగా కాంపౌండ్‌ హీరో వరుణ్‌తేజ్‌తో సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. యంగ్‌ హీరో నిఖిల్‌తో మరో సినిమాలోనూ నటిస్తోంది. గ్లామర్‌ పరంగా లావణ్యకు పెద్దగా హద్దులు లేవు కానీ, విచ్చలవిడి గ్లామర్‌ ప్రదర్శించే అవకాశమే రాలేదింతవరకూ. 

సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తుంటుంది. కానీ అక్కడ కూడా లిమిట్స్‌ ఫాలో అవుతుందీ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ మోడ్రన్‌ ఫ్రాక్‌లో లావణ్య త్రిపాఠి క్లీవేజ్‌ హాట్‌నెస్‌తో కొంచెం క్యూట్‌ కొంచెం హాట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది కదూ.!

ALSO READ: Qlik Here For The Gallery Of Lavanya Tripathi