ENGLISH

బిగ్‌బాస్‌లో కొట్లాటలు మొదలయ్యాయ్‌ బాస్‌.!

22 June 2018-12:50 PM

నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో 'బిగ్‌బాస్‌' ఇంతవరకూ సరదా సరదాగా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. సెకండ్‌ వీకెండ్‌ దగ్గర పడుతున్న తరుణంలో బిగ్‌బాస్‌కి కొంత మసాలా యాడ్‌ చేసినట్లే అనిపిస్తోంది. మెల్లమెల్లగా కొట్లాటలు స్టార్ట్‌ అయ్యాయి.

సామాన్యుడు నూతన్‌ నాయుడు, యంగ్‌ హీరో తనీష్‌ మధ్య బీభత్సమైన వార్‌ ఏదో నడుస్తున్నట్లుగా ప్రోమోస్‌తో పబ్లిసిటీ చేస్తున్నారు. 'ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు.. బాగా ఎక్కువ మాట్లాడుతున్నావ్‌ తనీష్‌.., మూసుకో.. చూసుకుందాం అంటే చూసుకుందాం..' అంటూ కంటెస్టెంట్స్‌ మధ్య కొట్లాటలు స్టార్ట్‌ అయ్యాయి. ఈ ప్రోమోతో షోకి మరింత మసాలాతో పాటు, క్రేజ్‌ కూడా యాడ్‌ అయ్యింది.

గత సీజన్‌లోనూ గొడవలు, కాంట్రవర్సీలు ఎక్కువే ఉన్నాయి. కానీ, ఈ సారి మాత్రం అది కొంచెం ఎక్కువగానే ఉండేటట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఈ కాంట్రవర్సీని బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నేచురల్‌ స్టార్‌ నాని ఎలా మేనేజ్‌ చేస్తాడో. అలాగే సామాన్యుడికీ, సెలబ్రిటీస్‌కీ మధ్య బిగ్‌హౌస్‌లో ఈ కొట్లాట ఎంతవరకూ వెళుతుందో చూడాలి. వీకెండ్‌ రానే వచ్చింది. ఈ వీకెండ్‌లో హౌస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యి బయటికి వచ్చేదెవరో?

తొలి ఎలిమినేషన్‌గా సంజనను బయటికి పంపించారు. రెండో ఎలిమినేషన్‌ సామాన్యుడిదా? సెలబ్రిటీదా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!

 

ALSO READ: Fighting Video Of Nuthan Naidu And Tanish