ENGLISH

మహానటి విడుదల తేదీ ఎప్పుడో తెలుసా

19 March 2018-13:33 PM

మహానటి సావిత్రి జీవితం పైన ‘మహానటి’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రం తాజాగా విడుదల తేదీని ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది.

ముందుగా చెప్పినట్టుగా ఈ చిత్రం ఈ నెల 29వ తేదీ నాడు విడుదలవ్వాల్సి ఉండగా, షూటింగ్ జాప్యం వల్ల ఈ చిత్రం విడుదల వాయిదాపడింది. ఇక తాజా ప్రకటన తరువాత ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలకానుందట. ఇప్పటికే ఈ చిత్రంలో పెద్ద పెద్ద నటులు అలనాటి నటుల పాత్రలు పోషిస్తుండగా మరికొంతమంది ప్రముఖులు ఈ జాబితాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

మొత్తానికి మహానటి చిత్రం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది..

 

ALSO READ: ఆవేశంలో ‘రంగస్థలం’ కథ చెప్పేసిన ‘చిరు’