ENGLISH

మ‌హేష్ సినిమాలో మ‌రో హీరో?

10 October 2020-09:09 AM

అత‌డు, ఖ‌లేజా త‌ర‌వాత‌... మ‌హేష్‌బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంద‌న్న వార్త‌... మ‌హేష్ ఫ్యాన్స్ లో ఎన‌లేని ఉత్సాహాన్ని నింపుతోంది. త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తాన‌ని, అతి త్వ‌ర‌లోనే ఉండ‌బోతోంద‌ని ఇటీవ‌ల మ‌హేష్ కూడా చెప్పేశాడు. దాంతో ఇప్ప‌టి నుంచే.. ఈసినిమా క‌బుర్లు మొద‌లైపోయాయి. మ‌హేష్ తో త్రివిక్ర‌మ్ సినిమా ఎలా ఉండ‌బోతోంది? ఎప్పుడు ఉండ‌బోతోంది? అనే విష‌యాలపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది.

 

ఈ కాంబోలో... ఓ మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తుంద‌న్న‌ది లేటెస్ట్ వార్త‌. ఈసారి మ‌హేష్ తో పాటు మ‌రో హీరో కూడా తెర‌పై క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఆ హీరో వెంక‌టేష్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది లేటెస్ట్ టాక్. `సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` లో చిన్నోడు - పెద్దోడుగా అల‌రించారు మ‌హేష్ - వెంకీ. అప్ప‌టి నుంచీ వీరిద్ద‌రి బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ తెర‌పై క‌ల‌సి న‌టిస్తే.. క‌నుల పండ‌గే. త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేయాల‌ని వెంకీ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. ఈ మ‌ల్టీస్టార‌ర్ సెట్ట‌యితే.. ఒకే సినిమాతో త్రివిక్ర‌మ్ కి రెండు ప‌నులూ అయిపోతాయి. కాబ‌ట్టి ఈసారి ప‌క్కాగా మ‌ల్టీస్టార‌ర్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని భోగ‌ట్టా.

ALSO READ: ఇదేం కెప్టెన్సీ టాస్క్‌ మహాప్రభో!