ENGLISH

మంచు వారింట సంబరాలు

13 April 2024-16:02 PM

మంచు వారింట సంబరాలు మొదలయ్యాయి. అవును మంచు మనోజ్, మౌనిక దంపతులకి పండంటి ఆడపిల్ల జన్మించింది. శనివారం ఉదయం వీరింటికి లక్ష్మీ దేవి వచ్చినట్టు మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 'మనోజ్ – మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో ఒక చిన్న దేవత వచ్చింది.  అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి MM పులి అనే నిక్ నేమ్ కూడా పెట్టాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రజంట్ మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.  మనోజ్ – మౌనిక దంపతులకు ఫాన్స్, పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లక్ష్మి చేసిన ట్వీట్ నే  మనోజ్ రీ ట్వీట్ చేశాడు.


ఇన్నాళ్ళకి మనోజ్ జీవితంలో ఆనందం వెల్లివిరిసిందని, ఇప్పటివరకు మనోజ్ పడ్డ కష్టాలకి ఇక చెక్ పడినట్టే అన్ని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. గత కొంత కాలంగా మనోజ్ వ్యక్తిగత,, వృత్తిగత జీవితం ఒడిదుడుకుల్లో ఉంది. భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాక కొంత సెటిల్ అయ్యాడు. మౌనిక కి కూడా ఇది రెండో పెళ్లి. మొదటి భర్త ద్వారా ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఈ జంట ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మధ్య కెరియర్ పై ద్రుష్టి పెట్టాడు మనోజ్. ఈటివి విన్ లో 'ఉస్తాద్' అనే టాక్ షో తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు.