ENGLISH

ఆ 'మీ టూ' బ్యూటీ మళ్లీ వచ్చిందోచ్‌.!

04 January 2020-10:30 AM

ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసి, 'మీ టూ' ఉద్యమానికి తెర లేపిన ముద్దుగుమ్మ తనూశ్రీ దత్తా మళ్లీ తెర పైకి వచ్చింది. ఆ రోజుల్లో ఈ వివాదం ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. తనూశ్రీ దత్తా తర్వాత చాలా మంది హీరోయిన్లు, నటీ నటులు ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. లైంగిక ఆరోపణలకు సంబంధించి తమ తమ అనుభవాలను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే, ఈ వివాదాన్ని లేవనెత్తిన తనూశ్రీ దత్తా, నానా పటేకర్‌పై కేసులు నమోదు చేసి, అమెరికాకి చెక్కేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నానా పటేకర్‌ కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు.

 

ఈ నేపథ్యంలో తన కేసు వాదించడానికి తనూశ్రీ దత్తా లాయర్‌ని నియమించుకుందట. అయితే, ఆయన కూడా అలాంటోడే అని లేటెస్ట్‌గా అర్ధమైందట ఈ బ్యూటీకి. ఇంకేం చేస్తుంది.? ఆ విషయాన్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి రచ్చ చేసే ప్రయత్నం చేస్తోంది. నానా పటేకర్‌పై చేసిన రచ్చతో తనూశ్రీకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. కెరీర్‌ని తిరిగి కొనసాగించేందుకు ఓ పబ్లిసిటీ స్టంట్‌లా ఆ వివాదాన్ని వాడుకుందా.? అంటే ఆమెకు కెరీర్‌ పైనా పెద్దగా మోజున్నట్లు లేదు. మరి ఎందుకు ఎప్పుడో ముగిసిపోయిన ఇష్యూని ఇప్పుడు బయటికి తీసి సంచలనమయ్యేలా చేసిందో.? మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సదరు లాయర్‌ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చిందో.? అసలింతకీ ఆమెకి ఏం కావాలో.? ఆమెకే తెలియాలి.

ALSO READ: 'బెస్ట్‌ పిక్‌ ఆఫ్‌ 2020' ఏంటో తెలుసా?