ENGLISH

అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో ‘మెగా’ సర్‌ప్రైజ్‌

02 October 2020-15:01 PM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రష్మిక మండన్న తొలిసారిగా అల్లు అర్జున్‌తో జతకడుతోంది ‘పుష్ప’ సినిమా కోసం. రొటీన్‌కి భిన్నంగా సినిమాలు తెరకెక్కిస్తోన్న క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌, ‘పుష్ప’ సినిమా కోసం ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్న విషయం విదితమే.

 

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లుక్‌.. ఇప్పటికే సంచలనంగా మారింది. ఇక, ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన గాసిప్‌ తెరపైకొచ్చింది. అదేంటంటే, ‘పుష్ప’ కోసం ఓ కీలక పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవిని చూపించబోతున్నాడట సుకుమార్‌. అయితే, ఆ పాత్ర నిడివి చాలా తక్కువట. నిడివి తక్కువే అయినా, ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌ ఆ పాత్ర చుట్టూ వుండబోతోందని సమాచారం. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ని పునఃప్రారంభించే పనుల్లో బిజీగా వున్నాడు సుకుమార్‌.

 

ఇక, సినిమాలో రష్మిక పాత్ర కూడా రొటీన్‌ కమర్షియల్‌ సినిమా హీరోయిన్‌లా కాకుండా, చాలా డిఫరెంట్‌గా వుండబోతోందని సమాచారం. నటిగా తనను తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఇదో అద్భుతమైన అవకాశం అంటోంది హీరోయిన్‌ రష్మిక. స్టార్‌ హీరోయిన్‌గా రష్మిక టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోన్న విషయం విదితమే. ఈ సినిమాతో ఆమె హీరోయిన్‌గా మరో మెట్టు ఎక్కడం ఖాయమన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది.

ALSO READ: వినాయ‌క్‌కు డ‌బుల్ బొనాంజా