ENGLISH

చిరంజీవిపై ముందే క‌ర్చీఫ్ వేసేశారా?

02 January 2020-12:09 PM

అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమాల వేడుక‌లంటే చిరంజీవి రాక త‌ప్ప‌ని స‌రి. ఆయ‌న ఆశీర్వాదాలు వాళ్ల‌కు కావాల్సిందే. అల్లు అర్జున్ కొత్త సినిమా `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి మాత్రం చిరు రావ‌డం లేదు. మ‌హేష్ బాబు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి చిరు ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. ఆ మ‌రుస‌టి రోజే.. బ‌న్నీ సినిమా ఫంక్ష‌న్‌. రెండు సినిమాల వేడుక‌ల‌కూ వ‌రుస పెట్టి వెళ్ల‌డం భావ్యం కాద‌నిపించి బ‌న్నీ సినిమాని వ‌దులుకున్నాడు చిరు.

 

అయితే నిజానికి బ‌న్నీ టీమ్ కూడా చిరంజీవిని ఆహ్వానించ‌డానికి సిద్ధ‌మైంది. వాళ్ల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా అంద‌రికంటే ముందు చిరుని క‌లిసి, క‌ర్చీఫ్ వేసేశాడు దిల్‌రాజు. మ‌హేష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి వ‌స్తాన‌ని చిరు మాట ఇచ్చేశాడు. ఆ త‌ర‌వాత అల్లు అర్జున్ టీమ్ చిరంజీవిని క‌లిసింద‌ని, ఇది వ‌ర‌కే మ‌హేష్‌కి మాటిచ్చాను కాబ‌ట్టి రావ‌డం కుద‌ర‌ని చిరు చెప్పేశాడ‌ని తెలుస్తోంది. సో.. ఇప్పుడు బ‌న్నీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథులు లేన‌ట్టే.

ALSO READ: వెంకీ బ్యాలెన్స్‌ అదుర్స్‌?