నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు సినిమాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ వార్తలు రావటమే కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు అని నిరుత్సాహ పడుతున్న ఫాన్స్ కి వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. ఎట్టకేలకి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. ఇందుకోసం హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ రంగం లోకి దిగారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఫాన్స్ కోసం ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
బాలకృష్ణ 50 ఏళ్లు సినీప్రయాణం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే వేడుకల్లో మోక్షజ్ఞ మొదటి సినిమా గూర్చి ప్రకటిస్తారని టాక్. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ 30వ పుట్టినరోజు సందర్భంగా అదే రోజున తన డెబ్యూ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ప్రారంభించి, బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అంతే కాదు హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను మోక్షజ్ఞ కి జోడి గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఖుషి కపూర్ ఈ మధ్యే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇంతలోనే టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది.
దేవర లో ఎన్టీఆర్ తో నటిస్తూ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన వారసుడితో ఖుషి జోడి కడుతోంది. అక్క చెల్లెల్లు ఇద్దరూ, ఇలా అన్నదమ్ములతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీనితో నందమూరి ఫాన్స్ సంతోషం రెట్టింపు అయింది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.