ENGLISH

రాజుగారు నిజం చేసేలానే ఉన్నారు 'డర్టీ'గా!

08 January 2020-12:00 PM

ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం 'డర్టీ హరి'. ఈ సినిమా ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజుగారి అంతటి వ్యక్తి ఈ తరహా మూవీని తెరకెక్కించడమేంటని ఎంతలా సరిపెట్టుకున్నా ఎవరికీ డైజెస్ట్‌ కావడం లేదు. అదేనండీ 'డర్టీ హరి' అనే మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాకి ఎమ్‌ఎస్‌ రాజు దర్శకుడు. బోలెడన్ని అద్భుత కళాఖండాల్ని నిర్మాతగా మనకు అందించిన మహానుభావుడు ఆయన. స్వయానా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అడల్ట్‌ కంటెంట్‌ మూవీనే 'డర్టీ హరి'. మొన్నామధ్య ఓ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వదిలారు. పక్కా అడల్ట్‌ పోస్టర్‌ అది.

 

లేటెస్ట్‌గా ఈ మూవీకి సంబంధించి మరో ఆణిముత్యంలాంటి పోస్టర్‌ వదిలారు. ఇది కూడా అంతకు తక్కువగా ఏమీ లేదు. హీరోయిన్‌గా నటిస్తున్న సిమ్రత్‌ కౌర్‌ పాత్రను పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్‌ అది. మొన్న వదిలిన లుక్‌లో హీరోయిన్‌ కాళ్లను మాత్రమే చూపించారు. ఇప్పుడు ఆమె టాప్‌ యాంగిల్‌ని టాప్‌ లెవల్‌లో చూపించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌లో ధరించిన డ్రస్‌తో నేలపై పడుకుని ఓ సెక్సీ మూడ్‌ క్రియేట్‌ చేస్తున్నట్లుంది ఈ పోస్టర్‌. షర్టు బటన్స్‌ ఓపెన్‌ చేసి, బ్లాక్‌ కలర్‌ ఇన్నర్‌ వేర్‌లోంచి క్లీవేజ్‌ సోయగాల్ని భారీగా ఎక్స్‌పోజ్‌ చేస్తున్న దృశ్యమిది.

 

టైటిల్‌కి తగ్గట్లుగానే డర్టీ డర్టీగా సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. యూత్‌ మెచ్చే కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని రాజుగారు చెప్పినట్లే చేస్తారేమో. ఓన్లీ యూత్‌ కంటెంట్‌ మూవీనే ఈ 'డర్టీ హరి' అనేలా ప్రమోషన్స్‌ ఊదరగొడుతున్నారు. మరి ఈ టైప్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌తో మన రాజుగారు బౌన్స్‌ బ్యాక్‌ అవుతారా.? రిలీజ్‌ వరకూ వేచి చూడాలిక.

ALSO READ: 'దర్బార్‌'కి షాక్‌ ఇచ్చిన నిర్మాణ సంస్థ!