మన హీరోలలో ఉన్న చిత్త శుద్ధి.. సామాజిక చైతన్యం.. శంకించలేనివి. సమాజానికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా, ఆదుకోవడానికి ముందుకు వస్తూనే ఉంటారు. శ్రీమంతుడు స్ఫూర్తితో కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నారు హీరోలు. మహేష్‌బాబు అయితే.. చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ప్రభాస్ కోట్లకు కోట్లు విరాళాలు అందిస్తున్నాడు.
తాజాగా... నాగార్జున ఓ గొప్ప పనికి సంకల్పించాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏకంగావెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నాగార్జున హౌస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో లో ఈ ప్రకటన చేశాడు. ఈ కార్యక్రమానికి... ఎంపీ సంతోష్ కుమార్ అతిథిగా హాజరయ్యారు. ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఓ ఉద్యమంగా నడిపిస్తున్న వ్యక్తి. హీరోలు, సెలబ్రెటీలతో మొక్కలు నాటిస్తూ, ఆ కార్యక్రమాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ షోకు సంతోష్ కుమార్ హాజరవ్వడంతో నాగార్జున అడవిని దత్తత తీసుకుంటున్నాని ప్రకటించారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ మూడు వారాల్లో మూడు మొక్కలు నాటాలని తన అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. కాకపోతే.. అడవిని ఎలా పరిరక్షిస్తారు? అందుకోసం నాగ్ ఏమేం చేయబోతున్నాడు? అసలు వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ని దత్తత తీసుకోవడం, వాటి బాబోగులు చూసుకోవడం కుదిరిన పనేనా? అనేది ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే... ఇప్పటికైతే ఓ అడుగు పడింది. తరవాత ఏం జరుగుతుందో చూడాలి.
ALSO READ: పుష్పలో.. వీరప్పన్?