ENGLISH

‘భీమ్లా నాయక్' స్థానంలో ‘బంగార్రాజు’ వస్తాడా ?

21 December 2021-17:50 PM

2022 సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘భీమ్లా నాయక్' నిలిచాయి. ఇందులో ‘భీమ్లా నాయక్' బయటికి వెళ్ళిపోయింది. థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని నిర్మాతల గిల్డ్ కోరడంతో ‘భీమ్లా నాయక్‌’ వెనక్కి తగ్గింది. అయితే ఈ స్థానంలో మరో సినిమా రావడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా లాక్ చేయలేదు. సంక్రాంతికి రావాలనేది మొదటి నుంచి ‘బంగార్రాజు’ప్లాన్. సోగ్గాడే చిన్నినాయకు ప్రిక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఇది.

 

2016 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సంక్రాంతి సినిమాగా నిలిచింది. అదే సెంటిమెంట్ ని ద్రుష్టిలో పెట్టుకొని బంగార్రాజు కూడా సంక్రాంతికి తీసుకురావాలనే నాగ్ ప్లాన్. అయితే మూడు సినిమాలు వుండటంతో ఇప్పటివరకూ ప్రకటన చేయలేదు. అయితే అనూహ్యంగా భీమ్లా నాయక్ తప్పుకున్నాడు. దీంతో బంగార్రాజు నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ వుందని టాక్. అయితే థియేటర్ల సమస్య కారణంగా భీమ్లా నాయక్ ని వాయిదా వేయమని కోరిన నిర్మాతల గిల్డ్ బంగార్రాజు విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎంత అనేది కూడా ప్రశ్నార్ధకం.

ALSO READ: అఫీషియ‌ల్ : భీమ్లా నాయ‌క్ అవుట్