ఈనెల 24న విడుదల కానున్న శ్యామ్ సింగరాయ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నిజానికి హిందీలో సైతం డబ్ చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నారు. దానికి కారణం.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ ఉండడమే. నాని సినిమాలపై ఈమధ్య బాలీవుడ్ దృష్టి పడింది.
ఇక్కడ హిట్ అయిన జెర్సీని అక్కడ రీమేక్ చేశారు. `శ్యామ్.. సింగరాయ్` తెలుగులో విజయం అందుకుంటే కచ్చితంగా బాలీవుడ్ దృష్టి ఇటు వైపు పడుతుంది. రీమేక్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వస్తుంది. అదే డబ్ చేసి ఉంటే, ఆ అవకాశం కోల్పోతారు. అందుకే.. హిందీలో ఈ సినిమాని డబ్ చేయలేదు. ఈ విషయమై.. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ''హిందీలో డబ్ చేద్దామనుకుని చివరి క్షణంలో డ్రాప్ అయ్యాం. ఈ కంటెంట్ పై మాకు నమ్మకం ఉంది. బాలీవుడ్ లో రీమేక్ అయ్యే సత్తా ఈ కథకు ఉంది. ఆ అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం'' అని చెప్పుకొచ్చాడు.
ALSO READ: అఫీషియల్ : భీమ్లా నాయక్ అవుట్