ENGLISH

పాపం 'నిధి' అలాగే సరిపెట్టుకోవాలా?

18 January 2020-14:30 PM

బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌కి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ సరసన నటించింది. రెండు సినిమాలూ నిధిని నిరాశపరిచినా, మూడో సినిమా పూరి జగన్నాధ్‌ పుణ్యమా అని 'ఇస్మార్ట్‌' హిట్‌ సొంతం చేసుకుంది. ఇక నిధి కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేదనుకున్నారంతా. అయినా, ఆ ముచ్చట ఇంతకాలమైనా తీరడం లేదు. ఇంకా ఇస్మార్ట్‌ బ్యూటీగానే ఉండిపోయింది నిధి అగర్వాల్‌. ఆ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద ఆఫర్‌ ఏదీ నిధిని వరించలేదు.

 

గళ్లా జయదేవ్‌ కొడుకు గళ్లా అశోక్‌ డెబ్యూ చిత్రంలో నిధి నటిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అయినా, నిధి కెరీర్‌కి పెద్దగా అది కలిసొచ్చే అంశం కాదు. ఓ స్టార్‌ హీరోతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ దక్కితేనే నిధి కెరీర్‌కి సార్థకత చేకూరుతుంది. కానీ, పాపం నిధికి ఆ అవకాశం రానే రావడం లేదు. హిట్టొచ్చినా నిధిని పట్టించుకునేవాళ్లే లేరు. అయితే, కొద్దో గొప్పో మాల్స్‌ ఓపెనింగ్స్‌, షాప్‌ ఓపెనింగ్స్‌తో ప్రస్తుతం నిధి సరిపెట్టుకోవల్సి వస్తోంది. ఎంతైనా క్రేజ్‌ ఉన్నప్పుడే కదా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అయితే, క్రేజ్‌ లెక్క పక్కన పెడితే, ఎలాగోలా ఇలా అయినా వచ్చిన అవకాశాల్ని నిధి సద్వినియోగం చేసుకుంటోందన్న మాట.

ALSO READ: Nidhi Agarwal Latest Photoshoot