ENGLISH

నివేదాని ఎందుకు టార్గెట్‌ చేశారబ్బా.?

07 January 2020-12:35 PM

లేటెస్ట్‌గా జరిగిన 'అల వైకుంఠపురములో..' మ్యూజిక్‌ కాన్‌సర్ట్‌లో స్టేజ్‌పై నివేదా పేతురాజ్‌ ముద్దులొలికే మాటలతో ఆకట్టుకుంది. అయితే, ఒక్కచోట నెటిజన్స్‌కి దొరికేసింది. నెటిజన్స్‌ అంటే ఎవరో కాదులెండి. మహేష్‌ ఫ్యాన్సే. సోషల్‌ మీడియాలో ఆమె స్పీచ్‌ని పదే పదే అరగదీస్తూ ఆట పట్టిస్తున్నారు. ఇంతకీ ఆమె స్పీచ్‌లో దొర్లిన తప్పేంటీ.? అనే వివరాల్లోకి వెళితే, స్టేజ్‌పై నుండి వర్క్‌ చేసిన వారందరికీ థాంక్స్‌ చెప్పడం హీరోయిన్స్‌ సంస్కారం. అదే పని చేసింది నివేదా పేతురాజ్‌. ఆ క్రమంలో 'థాంక్స్‌ టు ఖన్నీ సార్‌..' అంది. ఇదే మాటని పదే పదే రిపీట్‌ చేస్తూ నెట్టింట్లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఇందులో తప్పేముంది.. అంటే, 'ఖన్నీ సార్‌' అనేది బన్నీకి కన్వర్ట్‌ చేస్తున్నారు. దాంతో మహేష్‌ ఫ్యాన్స్‌కీ, బన్నీ ఫ్యాన్స్‌కీ మధ్య సోషల్‌ ఫైట్‌ జరుగుతోంది.

 

ఎప్పటి నుండో సోషల్‌ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్‌, మహేష్‌ ఫ్యాన్స్‌ మధ్య రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా ఈవెంట్‌ని టార్గెట్‌ చేసి సరికొత్త ఫైట్‌కి తెర లేపారు. అయితే, నిజంగానే నివేదా బన్నీని ఖన్నీ అని పొరబడిందా.? అంటే కానే కాదు. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో తమిళ నటుడు సముద్ర ఖని నటించిన సంగతి తెలిసిందే. సముద్ర ఖనిని తమిళంలో 'ఖని సార్‌' అంటారు. అదే నివేదా ప్రస్థావించింది. కానీ, యాంటీ బన్నీ ఫ్యాన్స్‌ దాన్ని 'ఖన్నీ'గా మార్చేసి, బన్నీకి ఆపాదించేశారు. అదీ అసలు సంగతి. పాపం నివేదా అలా బుక్కయిపోయింది.

ALSO READ: ట్రైలర్‌ టాక్‌: 'పులొచ్చింది మేక సచ్చింది'!