ENGLISH

పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రయ్యాడు

10 October 2017-12:39 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో సంతోషకరమైన వార్త. పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా దంపతులకు ఈరోజు ఉదయం పండంటి కొడుకు పుట్టాడు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో ఈ కాన్పు జరిగింది. ప్రస్తుతం పవన్ తన కొడుకును చేతిలో పట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే పవన్ కు మాజీ భార్య రేణుదేశాయ్ ద్వారా ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అనంతరం రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇంతకు ముందే పొలేనా అనే కూతురు ఉంది. ప్రస్తుతం తమ ఇంటికి మరో చిన్నారి రావటంతో పవన్ చాలా సంతోషంగా ఉన్నారు.

ALSO READ: జడివానలో తడిసి ముద్దవుతోన్న మిల్కీ బ్యూటీ