ENGLISH

జడివానలో తడిసి ముద్దవుతోన్న మిల్కీ బ్యూటీ

10 October 2017-12:10 PM

ఈ తరం వాన పాటల్లో 'రచ్చ' సినిమాలోని 'వాన వాన.. ' పాటలో తమన్నా అంద చందాలను వర్ణించడానికి మాటలు చాలవు. వానలో ఆమె చిందులు, వయ్యారంగా నడుం తిప్పులు ఓహో ఒక్కటేమిటి వర్ణనాతీతం ఆ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా పర్‌ఫామెన్స్‌. రామ్‌చరణ్‌, తమన్నా కలిసి చిందేసిన ఆ పాట చిరంజీవి సినిమాలోని రీ మిక్స్‌ సాంగ్‌. కాగా తాజాగా తమన్నా మరో వాన పాటలో చిందేసింది. తమన్నా మంచి డాన్సర్‌. అందులోనూ వాన పాటల్లో తమన్నా చిందులు కుర్రకారుకు మత్తెక్కించేస్తాయంతే. తాజాగా కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో తమన్నా వాన పాటలో చిందేసింది. జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా టైటిల్‌ ఫైనల్‌ కాలేదు. కానీ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తమన్నా, కళ్యాణ్‌రామ్‌ మధ్య ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణ పూర్తయింది. 'బాహుబలి' సినిమా తర్వాత హీరోయిన్‌గా తమన్నా నటించిన సినిమా ఇది. ఇటీవలే 'జై లవకుశ' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది తమన్నా. 'స్వింగ్‌ జరా..' అంటూ తెగ వయ్యారాలు పోయింది ఆ సాంగ్‌లో. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌తో ఈ రెయిన్‌ సాంగ్‌లో అదరగొట్టేసింది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ సినిమా. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: మాస్‌ మహరాజ్‌ ట్రిపుల్‌ ధమాకా?