ENGLISH

బిగ్‌బాస్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌!

08 October 2020-13:34 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి కోట్లాదిమంది అభిమానులున్నారు. పైగా, ఆయనిప్పుడు రాజకీయ నాయకుడు కూడా. దాంతో, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ తమ పీఆర్‌ బృందాల ద్వారా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు గాలమేస్తున్నారు. ఈ లిస్ట్‌లో అలేఖ్య హారిక అందరికంటే ముందుంది. గత సీజన్‌లో అషు రెడ్డి తాను పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమానినని బాహాటంగానే చెప్పుకుంది. అంతకు ముందు కౌషల్‌, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల ‘పవర్‌’తో బిగ్‌హౌస్‌లో సత్తా చాటిన సంగతి తెల్సిందే. అలేఖ్య హారిక విషయానికొసేస్తే, ఆమె పలు షార్ట్‌ ఫిలింస్‌తో ఫేం సంపాదించుకుంది.

 

ఈ మధ్యనే బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన ఓ టాస్క్‌ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ని ఇమిటేట్‌ చేసిన విషయం విదితమే. ఆ తర్వాతి నుంచీ ఆమె తరఫున పనిచేస్తున్న పీఆర్‌ బృందాలు, సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌కి అనుకూలంగా స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ, పవన్‌ అభిమానుల్ని ఎట్రాక్ట్‌ చేశాయి. ఇంకోపక్క అబిజీత్‌, అఖిల్‌ సార్థక్‌ తరఫున పనిచేస్తున్న పీఆర్‌ బృందాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఏ ఇతర హీరోల అభిమానులూ ఇంతలా బిగ్‌బాస్‌ గురించి చర్చించుకోవడంలేదేమో. పవన్‌ కళ్యాణ్‌ తర్వాత ఎన్టీఆర్‌ అభిమానులు కూడా కొంత యాక్టివ్‌గానే వుంటున్నారు బిగ్‌బాస్‌ విషయాలపై. వాళ్ళలో కొందరు అఖిల్‌కి మద్దతిస్తున్నారు. అలా అఖిల్‌కి మద్దతిస్తోన్న కొందరు ఎన్టీఆర్‌ అభిమానులు, అబిజీత్‌ని తీవ్రంగా ద్వేషిస్తుండడం గమనించాల్సిన విషయం.

ALSO READ: నాని, శివ నిర్వాణ 'ట‌క్ జ‌గ‌దీష్' షూటింగ్ పునఃప్రారంభం.