ENGLISH

జూనియర్‌ పవర్‌స్టార్‌ తెరంగేట్రం ఎప్పుడు?

22 June 2018-13:00 PM

ఇప్పుడు జూనియర్‌ పవర్‌స్టార్‌ అనే మాట టాలీవుడ్‌ టాక్‌ అయిపోయింది. తల్లి రేణూదేశాయ్‌ అలా అనొద్దు అని అన్నా కానీ, అభిమానులు అలాగే పిలుచుకుంటారు. ఇకపోతే తాజాగా ఇప్పుడు ఓ ఫోటో వైరల్‌ అయ్యింది. 

విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌ సొంతిల్లు కట్టుకోబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ లోగా ఓ అద్దిల్లు తీసుకున్నాడు. ఆ అద్దింటి గృహప్రవేశం నిమిత్తం ఫ్యామిలీతో విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు. ఫ్యామిలీ అంటే, పవన్‌ కళ్యాణ్‌, అన్నా లెజినోవా, వీరిద్దరి సంతానంతో పాటు, పెద్ద కొడుకు అకీరానందన్‌ కూడా ఉన్నాడు. ఈ ఫోటోనే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

ఇకపోతే అసలు వివరాల్లోకి వెళితే, అకీరా తెరంగేట్రం ఎప్పుడనేదే అభిమానుల్లో తలెత్తుతున్న అసలు ప్రశ్న. తెలుగులో కాకపోయినా ఆల్రెడీ అకీరా బాలనటుడిగా తన సత్తా చాటాడు. ఇక తెలుగు తెరపై హీరోగా తన టాలెంట్‌ ఏంటని ప్రూవ్‌ చేసుకోవాల్సిన టైమొచ్చింది. ప్రస్తుతం అకీరానందన్‌ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. చేతిలో బుక్స్‌, చూపుల్లో గట్స్‌, నడకలో చురుకు అన్నీ పవన్‌నే తలపిస్తున్నాయి. 

పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి ఎంతో మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఆ ఫ్యామిలీతోనే సంబంధం ఉన్న వారసులకు ఇంకెంత ఇన్‌స్పిరేషన్‌ అవుతారు. అందుకే ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే కాబోయే మెగాహీరో అకీరానందన్‌ త్వరలోనే తెలుగు తెరపై తన స్టామినా చూపించాల్సిందేగా మరి.
 

ALSO READ: జంబ లకిడి పంబ మూవీ రివ్యూ- 'పంబ' రేగిపోవ‌డం ఖాయం.