ENGLISH

పవన్‌ కళ్యాణ్‌ సెట్స్‌ మీదకు వెళ్ళేదెప్పుడు?

13 October 2020-12:00 PM

పవన్‌ కళ్యాణ్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో రెండు సినిమాలున్నాయి. వాటిల్లో ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌ త్వరగా పూర్తి చేయాల్సి వుంది. కానీ, దాంతోపాటుగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కూడా వేగంగానే పూర్తి చేయాలనేది పవన్‌ కళ్యాణ్‌ సంకల్పం అని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అన్నీ కుదిరితే దసరా తర్వాత పవన్‌ కళ్యాణ్‌, తిరిగి షూటింగులకు హాజరవుతాడంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ కోసం డేట్స్‌ అడ్జస్ట్‌ చేసే విషయమై ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ టీవ్ు ఓ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రెడీ చేసిందట. మరోపక్క, క్రిష్‌ సినిమా కాస్త ఆలస్యంగా తిరిగి షూటింగ్‌ ప్రారంభించుకోనుందని సమాచారం.

 

‘రెండు సినిమాలూ ఒకేసారి చేయడం కంటే, ఓ సినిమాని వేగంగా చేసేసి.. ఇంకో సినిమాపై ఫోకస్‌ పెడితే మంచిది..’ అని ఇటు ‘వకీల్‌ సాబ్‌’ మేకర్స్‌కీ, అటు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా నిర్మాతలకీ పవన్‌ చెప్పారట. ప్రస్తుతానికైతే పవన్‌ కళ్యాణ్‌ ఇంకా చాతుర్మాస దీక్షలోనే వున్నారు. ‘ఫిట్‌నెస్‌ విషయంలో పవన్‌ కళ్యాణ్‌కి పెద్దగా సమస్యలేవీ లేవు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఫిట్‌గానే వుంటారు. గెటప్‌ విషయంలోనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి..’ అని పవన్‌ కళ్యాణ్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే, పవన్‌ కళ్యాణ్‌ కోసం హరీష్‌ శంకర్‌ కూడా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.

ALSO READ: బండ్ల భారీ అడ్వాన్స్ ఇచ్చాడా.. ప‌వ‌న్‌ని టెమ్ట్ చేశాడా?