ENGLISH

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి పెద్ద త‌ల‌నొప్పిలా మారాడే...!

04 January 2020-12:30 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌లో బ‌ళ్లెంలా త‌యార‌య్యాడు రాపాక వ‌ర ప్ర‌సాద్‌. జ‌న‌సేన పార్టీ త‌ర‌పున గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా ఎన‌లేని పాపులారిటీ తెచ్చుకున్నాడు రాపాక వ‌ర ప్రసాద్‌. అయితే ఇప్పుడు త‌నే జ‌న‌సేన‌కూ, ప‌వ‌న్‌కీ పెద్ద త‌ల‌నొప్పిలా త‌యార‌య్యాడు. జ‌న‌సేన‌ది ఓ దారైతే, ఆ ఎమ్మెల్యేది మ‌రో దారిలా త‌యారైంది. జ‌న‌సేన నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తూ, జ‌గ‌న్‌ని స్తుతిస్తూ చాలాసార్లు వార్త‌ల్లోకి ఎక్కాడు రాపాక‌. ఇప్పడూ అంతే. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ పోరాడుతుంటే, రాపాక మాత్రం `జ‌గ‌న్ నిర్ణ‌యంలో త‌ప్పు లేదు.

 

మూడు రాజ‌ధానులు ఉండ‌డం వ‌ల్ల అన్ని ప్రాంతాలూ బాగుప‌డ‌తాయి` అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పైగా జ‌గ‌న్ పాల‌న బాగుందంటూ కితాబులు ఇస్తున్నాడు. దాంతో మ‌రోసారి జ‌న‌సేన షాక్‌కి గురైంది. అధినేత‌ది ఓ దారి, ఎమ్మెల్యేది మ‌రో దారా? అంటూ జ‌నాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. రాపాక పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్‌పై ఒత్తిడి పెరుగుతోంది. రాపాక కూడా అందుకోస‌మే ఎదురుచూస్తున్నారేమో. కాస్త మంద‌లించాల‌ని చూసినా, ప‌క్క పార్టీలోకి జంప్ అవ్వాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: రాశీఖన్నా - కేథరీన్‌ బోల్డ్‌ అండ్‌ హాట్‌ ఎవరు?