ENGLISH

'అల..'తో పూజా హెగ్దే రేంజే మారిపోయిందిగా.!

15 January 2020-08:35 AM

పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీగా రూపొందుతోన్న 'పింక్‌' సినిమాలో లీడ్‌ హీరోయిన్‌ రోల్‌ పోషించే హీరోయిన్‌ కోసం వేట కొనసాగుతూనే ఉంది. సెకండ్‌ లీడ్‌ పోషిస్తున్న క్యారెక్టర్స్‌లో నివేదా థామస్‌, అంజలి అంటూ ఈ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ విషయంలో మాత్రం అనుమానాలు అలాగే ఉన్నాయి. ఒరిజినల్‌లో నటించిన తాప్సీనే నటిస్తుందని కొందరూ, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తుందనీ ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ పాత్ర విషయంలో సస్పెన్స్‌ అలాగే నెలకొంది. పూజా హెగ్దే పేరు కూడా మొదట్లో వినిపించింది. అయితే, డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఆమె పేరు పక్కకు వెళ్లిపోయింది. అయితే, 'అల..' సూపర్‌ హిట్‌తో పూజా హెగ్దే పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.

 

'పింక్‌' రీమేక్‌కి పూజా హెగ్దే అప్పియరెన్స్‌ అయితేనే బావుంటుందని మళ్లీ ఆమెతో మంతనాలు చేస్తున్నారట. ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చి అయినా సరే, పూజా హెగ్దేనే తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకురావాలన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమాని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి, దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ లేకుండానే సినిమా ఆల్రెడీ షూటింగ్‌ జరిగిపోతోంది. ఇకపోతే, అన్నీ కలిసొచ్చి, పూజా డేట్స్‌ అడ్జస్ట్‌ అయితే, పూజా హెగ్దే పేరునే 'పింక్‌' రీమేక్‌లో ఫైనల్‌ చేయొచ్చంటున్నారనేది తాజా వార్త.

ALSO READ: Pooja Hegde Latest Hot Photoshoot