ENGLISH

ఆ విషయంలో రష్మిక కంటే పూజకే ఎక్కువ!

13 January 2020-12:02 PM

'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాతో ఈ సంక్రాంతికి రష్మికా మండన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అల వైకుంఠపురములో..' సినిమాతో పూజా హెగ్దే ప్రేక్షకుల్ని పలకరించింది. రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద మంచి రిజల్ట్‌ అందుకున్నాయి. ఆడియన్స్‌ నుండి మంచి టాక్‌ సంపాదించుకున్నాయి. అయితే, హీరోయిన్స్‌ విషయానికి వస్తే, మహేష్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసిన రష్మిక కన్నా, బన్నీతో రొమాంటిక్‌గా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న పూజా హెగ్దేకే ఈ రేసులో ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సాంగ్స్‌లో పూజా హెగ్దే అందాలు, ఆమె క్లాస్‌ పర్‌ఫామెన్స్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి.

 

'హి ఈజ్‌ సో క్యూట్‌..' సాంగ్‌లో రష్మిక పర్‌ఫామెన్స్‌, డాన్స్‌ ఇరగీసేసినా, 'అల వైకుంఠపురములో..' మ్యూజిక్‌ ఆల్బమ్‌ మొత్తంలో పూజా హైలైట్‌గా నిలుస్తోంది. 'సామజవరగమనా..' తీసుకున్నా, 'బుట్టబొమ్మా..' సాంగ్‌ తీసుకున్నా ఏ పాటకి ఆ పాటే అన్నట్లుగా పూజా హెగ్దేని ఆరాధిస్తున్నారు ఆడియన్స్‌. దాంతో టోటల్‌గా పూజాకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. పూజా పర్‌ఫామెన్స్‌లో ఎక్కడా వంకలు పెట్టడానికి లేదంటున్నారు. కానీ, రష్మిక అక్కడక్కడా తన ఓవర్‌ యాక్షన్‌తో విసిగించిందనే విమర్శలున్నాయి. అలా.. ఎలా చూసుకున్నా, రష్మికతో పోల్చితే, పూజకే 'సరిలేరు ఎవ్వరూ..' అనే కాంప్లిమెంట్స్‌ దక్కుతున్నాయి.

ALSO READ: బన్నీ సినిమాకి ఎన్టీఆర్‌ స్వీట్‌ రివ్యూ!