సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఎన్ని సంవత్సరాలు గడిచినా తగ్గడం లేదు. ‘జైలర్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్న ఆయన, ఇప్పుడు ‘కూలీ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ యాక్టర్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘కూలీ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రికార్డు స్థాయిలో రూ.120 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓటీటీ హక్కుల కోసం ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.280 కోట్లుగా ఉండొచ్చని టాక్. అలా చూస్తే, కేవలం ఓటీటీ డీల్ ద్వారానే మొత్తం ఖర్చులో దాదాపు 40% రికవర్ అయ్యినట్టే. ఇది లోకేష్ కనగరాజ్ మార్కెట్ రేంజ్‌తో పాటు, రజనీకాంత్ గ్లోబల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కూలీ’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఇంత భారీ బిజినెస్ జరగడం చూస్తుంటే, సినిమా విడుదలైన తర్వాత మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ: సుప్రీత వివరణ.. బెట్టింగ్ యాప్ ప్రచారంపై క్షమాపణలు