ENGLISH

మెగా ఛాన్స్‌ కోసం ట్రై చేస్తోన్న రకుల్‌ ప్రీత్‌!

30 December 2019-15:37 PM

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌లో బ్యాడ్‌ ఫేజ్‌ రన్‌ అవుతోంది. చేతిలో సినిమాలున్నా, సరైన సక్సెస్‌ దొరకడంలేదామెకి. కొత్త ఏడాదిలో మాత్రం సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడతానంటోంది ఈ బ్యూటీ. చాలాకాలంగా విడుదలకు నోచుకోని ఓ బాలీవుడ్‌ సినిమా ఎట్టకేలకు విడుదలవుతుండడంతో ఆ సినిమా విజయంతో తన కెరీర్‌లో కొత్త కళ కన్పిస్తుందని రకుల్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. 'సిమ్లా మిర్చి' పేరుతో ఈ సినిమా జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే, రకుల్‌ చేతిలో ఓ తెలుగు సినిమా కూడా వుంది. నితిన్‌ సరసన ఓ సినిమాలో ఆమె నటించనున్న విషయం విదితమే.

 

కాగా, రష్మిక ఓ మెగా ఛాన్స్‌ కోసం ప్రయత్నాలు చాలా జోరుగా సాగిస్తుందట. మెగాస్టార్‌ చిరంజీవితో ఆన్‌ స్క్రీన్‌ కలిసి కన్పించాలనేది తన డ్రీమ్‌.. అంటూ మెగా ప్రాజెక్ట్‌కి గాలమేసే పనిలో బిజీగా వుంది. అన్నట్టు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మెగాస్టార్‌ చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో ఇప్పటికే కన్పించారు. చరణ్‌ హీరోగా వచ్చిన 'బ్రూస్‌లీ' సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తే, ఆ సినిమాలో చిరంజీవి సర్‌ప్రైజింగ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. సో, రకుల్‌ గనుక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మెగా ప్రాజెక్ట్‌లో నటిస్తే, మెగాస్టార్‌ చిరంజీవితో ఆమెకిది రెండో సినిమా అవుతుంది. అన్నట్టు, ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు విన్పిస్తోన్న విషయం విదితమే.

ALSO READ: బికినీ బ్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2019