ENGLISH

రిస్క్ చేయ‌డానికి రెడీ అయిపోయిన RRR

28 December 2021-11:00 AM

జన‌వ‌రి 7న ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌స్తుందా? రాదా? అనేది పెద్ద ఫ‌జిల్ గా మారిపోయింది. నార్త్ లో థియేట‌ర్ల ప‌రిస్థితి ఏం బాలేదు. అక్క‌డ నైట్ క‌ర్‌ఫ్యూ ప్ర‌మాదం ఉంది. మ‌రోవైపు.. ఏపీలో టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆర్‌.ఆర్‌.ఆర్ విడుదల అవ్వ‌డం రిస్కే.

 

అయితే ఈ రిస్క్ తీసుకోవ‌డానికి రాజ‌మౌళి రెడీ అయిపోయాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి డిసైడ్ అయిపోయిన‌ట్టు టాక్‌. ఎందుకంటే.. ఇప్ప‌టికే ఈ సినిమా చాలా సార్లు వాయిదాప‌డింది. మ‌రోసారి వాయిదా వేస్తే బ‌య్య‌ర్ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు.. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ పూర్త‌యిపోయింది. అక్క‌డ ధియేట‌ర్ల‌న్నీ బ్లాక్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా వేస్తే... ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ డ‌బ్బులు వెన‌క్కి క‌ట్టాల్సిన ప‌రిస్థితి. జ‌న‌వ‌రి 7 దాటితే.. ప‌రిస్థితులు మార‌తాయ‌న్న గ్యారెంటీ లేదు. థ‌ర్డ్ వేవ్ భ‌యాలు పొంచి ఉన్నాయి. ఏ క్ష‌ణంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో తెలీదు. అందుకే జ‌న‌వ‌రి 7నే ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార్ట‌. డిసెంబ‌రు 31న హైద‌రాబాద్ లో ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ ఓ ప్రెస్ మీట్ నిర్వ‌హిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో రిలీజ్ డేట్ పై మ‌రింత క్లారిటీ రావొచ్చు.

ALSO READ: RRR ఆప్ష‌న్ అదొక్క‌టేనా?