ENGLISH

షాక్‌... సంజూ ఇలా అయిపోయాడేంటి?

05 October 2020-13:30 PM

సంజ‌య్ ద‌త్ అంటే... భారీ ఆకారం క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంది. వ‌యసు 60 దాటినా... ఆ జోరు ఎక్క‌డా త‌గ్గ‌దు. సంజూకి ఇప్పుడు ప్ర‌తినాయ‌క పాత్ర‌లు వ‌స్తున్నాయంటే.. సంజూ ఆకార‌మే అందుకు కార‌ణం. అలాంటి సంజూ ఇప్పుడు బ‌క్క చిక్కిపోయాడు. సంజూని చూస్తుంటే అభిమానుల క‌న్నీళ్లు ఆగ‌డం లేదు.

 

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధపడుతున్నట్టు ఇటీవ‌ల సంజూ ప్ర‌క‌టించాడు. ఆ త‌ర‌వాత‌.. కీమోథెర‌పీ చికిత్స చేయించుకున్నాడు. ఇటీవ‌ల దుబాయ్ వెళ్లిన సంజూ అక్క‌డ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ త‌ర‌వాత ఇప్పుడు ముంబై తిరిగి వ‌చ్చాడు. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలో సంజయ్‌దత్‌ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో సంజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి మున్నాభాయ్ ఎలా అయిపోడంటూ బాధ ప‌డుతున్నారు. రెండో దశ కీమోథెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

ALSO READ: 'గ‌మ‌నం'లో శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌