ENGLISH

'సరిలేరు..' రిలీజ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడిందా.?

03 January 2020-12:05 PM

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న 'సరిలేరు నీకెవ్వరూ..' చిత్రం రిలీజ్‌ డేట్‌ కన్‌ఫ్యూజన్‌లో పడిందనే ప్రచారం జరుగుతోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని హోల్డ్‌లో పెట్టినట్లు కనిపిస్తోంది. తర్వాతి రోజు అనగా జనవరి 12న అల్లు అర్జున్‌ సినిమా రిలీజ్‌ ఉన్న కారణంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మార్చే ఆలోచనల్లో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన సెన్సార్‌ రిపోర్ట్‌ పోస్టర్‌పై రిలీజ్‌ డేట్‌ వేయకపోవడం ఈ తాజా అనుమానాలకు తావిస్తోంది.

 

సంక్రాంతి రిలీజ్‌ అని మాత్రమే ఆ పోస్టర్‌పై రాసుంది. అంటే, రిలీజ్‌ డేట్‌లో పునరాలోచన చేస్తున్నారనుకోవాలి. ఇక సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకి యు బై ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సీనియర్‌ హీరోయిన్‌ లేడీ అమితాబ్‌ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతోనే మరో సీనియర్‌ నటి సంగీత కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారు. కమెడియన్‌గా, నటుడిగా పలు చిత్రాల్లో నటించిన బండ్ల గణేష్‌ గత కొంత కాలంగా రాజకీయాల పేరు చెప్పి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా ఇదే సినిమాతో మళ్లీ ముఖానికి రంగు వేసుకోవడం విశేషం. మహేష్‌ బాబు మిలిటరీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు కాగా, దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు.

ALSO READ: రాజశేఖర్‌ సారీ చెప్పాడు. కానీ!