ENGLISH

మహేష్‌తో 'డాంగ్‌ డాంగ్‌' ఇప్పుడు రష్మిక టర్న్‌.!

02 January 2020-17:30 PM

మిలిటరీ డ్రస్‌లో 'డాంగ్‌ డాంగ్‌..' అంటూ మిల్కి బ్యూటీ తమన్నా, మహేష్‌ బాబుతో స్టెప్పులిరగదీసిన సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. ఆ సాంగ్‌కి బీభత్సమైన రెస్పాన్స్‌ రావడంతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నాకి మంచి ప్రశంసలు దక్కాయి డాన్స్‌ పరంగా. అయితే, ఆ పాటని స్పెషల్‌ సాంగ్‌లా కాకుండా, పార్టీ సాంగ్‌లా అభివర్ణించారు చిత్ర యూనిట్‌. ఈ సంగతి అటుంచితే, ఇప్పటికే 'సరిలేరు..' నుండి వచ్చిన సాంగ్స్‌ అన్నింటికీ గుడ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. లేటెస్ట్‌గా రష్మిక - మహేష్‌ మధ్య ఓ మాస్‌ సాంగ్‌ సాంగ్‌ చిత్రీకరణ సందర్భంగా ఆన్‌ లొకేషన్‌ నుండి లీకైన ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

 

పక్కా మాస్‌ మసాలా లుక్స్‌లో రష్మిక - మహేష్‌ కనిపిస్తున్నారు ఈ స్టిల్స్‌లో. శేఖర్‌ మాస్టర్‌ డాన్స్‌ కంపోజేషన్‌లో 'జిల్‌ జిల్‌ జిగేలనేలా..' ఈ సాంగ్‌ ఉండబోతోందని తాజా స్టిల్‌ని బట్టి అర్ధమవుతోంది. రష్మికకు ఇంతవరకూ సరిగ్గా డాన్సులు వేసే ఛాన్స్‌ రాలేదు. కానీ, ఆమెలో మంచి గ్రేస్‌ ఉంది. అప్పుడప్పుడూ అది ప్రూవ్‌ అయ్యింది. ఈ సారి పూర్తిగా రష్మికలోని డాన్సింగ్‌ డాల్‌ బయటికొచ్చేయనుందట. మహేష్‌తో డాన్సులు అటుంచితే, తదుపరి చేయబోయే అల్లు అర్జున్‌ సినిమాకి రష్మిక బాగా ముదిరిపోనుందంటున్నారు. ఇప్పటికే స్పెషల్‌గా డాన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటోందట. ఆ ఎక్స్‌పీరియన్స్‌ అంతా ప్రస్తుతం మహేష్‌తో పర్‌ఫామెన్స్‌తో చూపించనుందట. ఇక అల్లు అర్జున్‌ సినిమాకి వచ్చేసరికి రష్మిక దుమ్ము రేపేస్తానంటోంది.

ALSO READ: ఈరోజు రాత్రి నుంచే చిరు సంద‌డి