ENGLISH

వార్ 2 లో పఠాన్ హవా?

24 October 2024-14:57 PM

ఈ మధ్య అన్ని భాషల్లోనూ మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వస్తుండటంతో అన్ని భాషలకి చెందిన వారు భాగం అవుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ లో వచ్చే సినిమాల్లో సౌత్ నటీ నటులు పలువురు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో అయితే ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు  సోలో సినిమాలు చేయటం తగ్గింది. సింగం 3 బడా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోంది. ఇప్పుడు వార్ 2 కూడా అదే లిస్ట్ లో చేరుతోంది.            


RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర మూవీతో సోలోగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు. నెక్స్ట్ వార్ 2 లో విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో వార్ 2 లో నటిస్తుండటం హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుండటంతో ఈ మల్టీ స్టారర్ మూవీకి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు వార్ 2 లో ఇంకో బడా స్టార్ పేరు కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కూడా వార్ 2 లో నటిస్తున్నట్లు సమాచారం. సోలోగా సినిమాలు చేస్తూనే, ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఇతర హీరోల సినిమాల్లో మెరిసే షారుక్ ఇప్పుడు వార్ 2 లో భాగమై ఫాన్స్ ని అలరించనున్నారు. 


అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్, లాట్ ఆఫ్ సర్ప్రయిజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు  షారుక్ పాత్ర గూర్చి రివీల్ చేశారు. ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో పఠాన్‌ లుక్ లో షారుక్ ఎంట్రీ ఉంటుందని, అప్పుడే షారుక్ షూట్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఒకే ఫ్రేమ్ లో షారుక్, హృతిక్, తారక్ లు కనిపిస్తారని సమాచారం. ఈ న్యూస్ విన్న ఫాన్స్ ఆహా  ఒకే టికెట్ పై మూడు సినిమాలు చూస్తామని మురిసిపోతున్నారు. వార్ 2 లో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో నటిసున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంకా కన్ఫమ్ కాలేదు. త్వరలోనే వార్ 2 లో షారుక్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్.