ENGLISH

‘గబ్బర్‌సింగ్‌’ నా లైఫ్‌ని మార్చిన సినిమా: శృతిహాసన్‌!

06 October 2020-17:00 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా హీరోయిన్‌ శృతిహాసన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన విషయం విదితమే. అయితే, తన తాజా ఇంటర్వ్యూలో ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాపై శృతిహాసన్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ పెద్దయెత్తున గాసిప్స్‌ షురూ అయ్యాయి.

 

నేషనల్‌ మీడియాతో శృతిహాసన్‌ మాట్లాడినప్పుడు, తెలుగు సినీ పరిశ్రమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. అయితే, ఈ విషయమై శృతిహాసన్‌ వివరణ ఇచ్చింది. తన కెరీర్‌లో ‘గబ్బర్‌సింగ్‌’ చాలా స్పెషల్‌ ఫిలిం అనీ, తన జీవితాన్ని మార్చిన సినిమాగా ‘గబ్బర్‌సింగ్‌’ పట్ల తనకెప్పుడూ ఆ గౌరవం వుంటుందనీ, పవన్‌ కళ్యాణ్‌తో పనిచేసే అవకాశం రావడం అద్భుతమనీ పేర్కొంది శృతిహాసన్‌.

 

సోషల్‌ మీడియా వేదికగా బ్యాక్‌ టు బ్యాక్‌ ట్వీట్లు వేసింది శృతిహాసన్‌ ఈ విషయమై. ప్రస్తుతం తెలుగులో ‘క్రాక్‌’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది శృతిహాసన్‌. బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాక తిరిగి సినిమాలపై ఫోకస్‌ పెట్టిన శృతిహాసన్‌, లాక్‌డౌన్‌ సమయంలో తనలోని మ్యూజికల్‌ టాలెంట్‌కి మరింత పదును పెట్టింది. తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అనే తేడాలు తనకేమీ లేవనీ.. మొత్తంగా ఇండియన్‌ సినిమా అనే భావనలో తాను ఎప్పుడూ వుంటానని శృతిహాసన్‌ అంటోంది.

ALSO READ: పూరి 'ఇస్మార్ట్‌' స్టెప్‌