ENGLISH

హత్యకి గురైన ప్రముఖ గాయని!

18 October 2017-20:13 PM

ప్రముఖ పాప్ గాయని హర్షితా దహియానని గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీలో హత్యచేశారు.

వివరాల్లోకి వెళితే, ఢిల్లీ శివార్లలోని ఒక నిరమానుష్య ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారుని గుర్తుతెలియని దుండగులు అడ్డగించి అత్యంత సమీపం నుండి తలపైన కాల్చి చంపారు. ఆ సమయంలో ఆమెతో పాటు మరో ఇద్దరు అదే కారులో ప్రయానిస్తున్నట్టు సమాచారం.

అయితే ఆమె ఇంతకుముందే తనకి ప్రాణహాని ఉన్నట్టు పోలీసులని ఆశ్రయించినట్టు తెలిసింది. ఆమె సమీప కుటుంబసభ్యుల నుండే ఆమెకి హాని ఉన్నట్టు ఆమె ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించిందట.

అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా ఢిల్లీ లోని ప్రజలు షాక్ కి గురయ్యారు. పంజాబ్-హర్యానా ప్రాంతాల్లో ఈమెకి అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ.

 

ALSO READ: రాజా ది గ్రేట్ రివ్యూ & రేటింగ్స్